ఆ సినిమాలో చిరంజీవిని హీరోగా దాసరి వద్దన్నారు.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన కెరియర్ మొదట్లో విలన్ పాత్రలు పోషిస్తున్న చిరంజీవి శివరంజని నాటికే హీరో కావాల్సింది.

కానీ గురువు గారు ఆయన్ని సెలెక్ట్ చేయలేదని ప్రముఖ దర్శకుడు దావాల సత్యం చెప్పుకొచ్చారు.

అతను అప్పటికే అవకాశాల కోసం చాలా బాధ పడుతున్నాడని, అదీ కాక ఆయన చాలా బాగా నటిస్తున్నాడని ఆయన తెలిపారు.కానీ గురువు గారు హరి ప్రసాద్ ను సెలెక్ట్ చేశారని ఆయన చెప్పారు.

అప్పుడు ఆయన ఒక మాట అన్నారని ఇలా చెప్పారు.నేను డైరెక్టర్ అవ్వడం ఖాయం.

అందులో మొదటి హీరోగా నిన్ను పెట్టడం తథ్యం అని.తనకు హీరో క్యారెక్టర్ ఇవ్వకపోయినా పర్లేదు.కానీ చెప్పుకోవడానికి కనీసం ఒక 5 సీన్స్ ఇవ్వండి చాలు అని చిరంజీవి తనతో అన్నట్టు సత్యం చెప్పారు.

Advertisement

ఐదు సీన్లు కాదు, ఇస్తే నీకు హీరోనే ఇస్తానని తాను అన్నట్టు ఆయన తెలిపారు.అన్న మాట ప్రకారం తాను పేరు నిలబెట్టుకుని, తనకు హీరో క్యారెక్టర్ ఇచ్చినట్టు ఆయన తెలిపారు.

అప్పటి నుంచి ఆయన తనతో కలవడానికి, మాట్లాడడానికి రోజూ వస్తుండే వారని ఆయన స్పష్టం చేశారు.ఆరోజే మేము అందరం అనుకున్నాం.ఇతను ఇండస్ట్రీలో చాలా ఎత్తుకు ఎదుగుతాడు అని అనుకున్నామని చెప్పారు.

ఇక చిరంజీవి, తాను ఒకే ఊర్లో పుట్టామన్న ఆయన, వాళ్ళిద్దరికీ సన్మానం చేయాలని వారి ఊరి పెద్దలు నిర్ణయించారు అని దావాల సత్యం వివరించారు.అప్పుడు చిరంజీవి స్టేజ్ పైన మాట్లాడుతుండగా, తన ఫస్ట్ సినిమాలో తనను హీరోగా పెట్టుకున్నాడు.ఇప్పటికి 4 సినిమాలు తీశాడు.

మరి వాటిల్లో ఎందుకు పెట్టుకోలేదో మీరు అడగాలని చిరంజీవి అన్నట్టు ఆయన చెప్పారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

దానికి జనాలంతా చెప్పాలి చెప్పాలి అని అరిచారని ఆయన చెప్పుకొచ్చారు.దానికి ఆయన ఏం చెప్పాలి దీనికి.సినిమాల్లో అన్నీ కుదరవు.

Advertisement

కుదిరిన వాటితో తృప్తి పడాలి.కుదరని వాటితో చూసి చూడనట్టు ఉండి పోవాలి అని ఆయన అన్నట్టు సత్యం వివరించారు.

అంతే గానీ వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.వాళ్ళు ఇప్పటికీ మంచి స్నేహితలమే అని ఆయన వెల్లడించారు.

తాజా వార్తలు