మంత్రి ఉత్తమ్ కాన్వాయికి ప్రమాదం

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాన్వాయ్ కి ప్రమాదం సంభవించింది.

శుక్రవారం హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉర్సు గంధం మహోత్సవానికి వెళ్తుండగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలబడి ఉండటంతో వారిని చూసి మంత్రి సడన్ కారు ఆపడంతో మంత్రి కాన్వాయ్ లో వెనక వేగంగా వస్తున్న 6 కార్లు ఒకేసారి బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.అనంతరం మంత్రి కారు వెళ్లిపోవటంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

ఇసుక ట్రాక్టర్ పల్టీ పాదచారునికి తీవ్ర గాయాలు

Latest Suryapet News