నల్లగొండ జిల్లా:పెద్దవూర మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల బాలుర పాఠశాలను గురువారం రాత్రి నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాసులు ఆకస్మకంగా తనిఖీ చేసి, రాత్రి విద్యార్థులతోనే గడిపి వారితోనే బస చేశారు.
టెన్త్ మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులతో బోర్డ్ ఎగ్జామ్స్ గురించి,పెరిగిన డైట్ చార్జీలు,మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు.పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా డిటిడిఓ రాజ్ కుమార్,నల్లగొండ జిల్లా గురుకుల రీజినల్ కోఆర్డినేటర్ ఇస్లావత్ బలరాం నాయక్, ఎమ్మార్వో సాంబాల సరోజ,ఎంపీడీవో సుధీర్, స్థానిక ప్రిన్సిపాల్ మంగ్త భూక్యా మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.