వ్యవసాయ బావిలో మొసలి కలకలం

సూర్యాపేట జిల్లా:మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండా గ్రామపంచాయతీ పరిధిలో మేళ్లచెరువు గ్రామానికి చెందిన కందుల శేషగిరి,బొగ్గవరపు సీతయ్య పొలంలోని వ్యవసాయ బావిలో మొసలి కనిపించినట్టు రైతులు తెలిపారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లడుతూ మొసలి గత నాలుగు రోజులుగా తమ పొలంలో సంచరిస్తుందని,మొదట దాన్ని గుర్తించలేదని,సోమవారం పొలానికి వెళ్ళగా బావిలో కనిపించడంతో భయంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడం జరిగిందన్నారు.

అటవీ శాఖ అధికారులు ఆదేశాల మేరకు స్థానిక అటవీ శాఖ కానిస్టేబుల్ వినోద్ ఘటనా స్థలానికి చేరుకుని బావి యొక్క పరిసరాలను పరిశీలించి,అటవీశాఖ అధికారులకు తెలియజేశారు.ఉన్నతాధికారుల సూచనల మేరకు బావిలో నీటిని తొలగించే ఏర్పాటు చేస్తున్నారు.

బావిలో నీటిని తొలగించిన వెంటనే మొసలిని పట్టుకునే ఏర్పాటు చేస్తామని కానిస్టేబుల్ వినోద్ తెలిపారు.సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు నుండి వచ్చి వుంటదని స్థానికులు భావిస్తున్నారు.

ఇండియన్ సైంటిస్టుల సత్తా.. స్పేస్‌లో డాకింగ్ ప్రయోగం సక్సెస్.. ఎలైట్ క్లబ్‌లో భారత్!
Advertisement

Latest Suryapet News