బరాఖత్ గూడెం కాలువలో మొసలి కలకలం...!

సూర్యాపేట జిల్లా: మునగాల మండలం బరాఖత్ గూడెం గ్రామ రెవెన్యూ శివారు వద్ద కాలువలో మొసలి సంచరిస్తుందన్న వార్త కలకలం రేపుతుంది.

స్థానిక రైతు కథనం ప్రకారం.

గత రెండు రోజుల క్రితం బరాఖత్ గూడెం గ్రామనికి చెందిన రైతు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లడంతో కాల్వలో మొసలి కనిపించిందని గ్రామస్థులకు,సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.దీనితో స్థానిక తహసీల్దార్,ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఫారెస్ట్ అధికారులు మొసలి కదలికలు లేవని,రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రెముడాల ధ్రువకుమార్,ఫారెస్ట్ అధికారులు శ్రీనివాస్, ఖదీర్,జ్యోతి,రైతులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News