మండలి ఎన్నికలు జగన్కు కలిసి రావడం లేదా? Latest News - Telugu

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే జవాబు వస్తుంది .గత ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచి మూడు రాజధానులు బిల్లును అసెంబ్లీలో ఆమోదింప చేసుకున్న జగన్ ప్రభుత్వానికి మొదటి దెబ్బ తగిలింది శాసనమండలి లోనే.అప్పటినుంచి ఇప్పటివరకు ఆ బిల్లు విషయంలో ముందుకు వెళ్లడానికి అనేక అడ్డంకులు ప్రభుత్వానికి ఎదురయ్యాయి .కోర్టులో కూడా ఆ బిల్లు తిరస్కారానికి గురైంది.ఈ విషయంలో ఆగ్రహించిన జగన్( Jagan ) ఏకంగా శాసనమండలి నే రద్దు చేయడానికి పూనుకున్నారు.అసెంబ్లీలో ఆ విధంగా తీర్మానం కూడా చేశారు.కేంద్రానికి ఆమోదం కోసం కూడా పంపారు .అయితే కాలం గడిచిన కొద్ది మండలి లో వైసీపీ సభ్యులు బలం పెరగడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు .ఆ తర్వాత తాను తీసుకుని నిర్ణయాలను విజయవంతంగా పూర్తి చేసుకుంటూ వస్తున్న జగన్కు ఇప్పుడుశాసన మండలి మూలంగా మరొక ఎదురు దెబ్బ తగిలింది.ఉప ఎన్నికల దగ్గర నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్న జగన్ కు ఎమ్మెల్సీ ఎన్నికలు కొరకరాని కొయ్యగా మారి పోయాయి .ఇప్పటికే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీపడిన మూడు సీట్లను కోల్పోయిన వైసీపీ ప్రభుత్వానికి( YCP Govt ) ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక సీటు లో అనూహ్యారీతిలో పరాభవం చెందటం అంతా తేలికగా మర్చిపోయే విషయం కాదు.

నిజానికి ఊహగానాలే తప్ప సంచలనాలు నమోదు అవ్వడానికి అవకాశం లేదని, అధికార పార్టీ కచ్చితంగా గెలుస్తుంది అన్న అంచనాలు నడుమ ఇలా క్రాస్ ఓటింగ్ నమోదవడం, తిరుగులేని జగన్ అధికారానికి ఖచ్చితమైన ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు.పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాజయానికి కారణంగా మా ఓటర్లు వేరే ఉన్నారు అని చెప్పినా సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) గారు ఇప్పుడు తమ సొంత గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పడడానికి ఏ కారణాలు చెప్తారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా తాము అనుకున్నది ఆరు నూరైనా సరే చేయాలనుకుంటున్న ప్రభుత్వానికి ఇది ఖచ్చితమైన గుణపాఠం అని చెప్పాలి.జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మండలి ఎన్నికలు జగన్కు కలిసి రాలేదా అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారట .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube