ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ కరోనా వైరస్ ప్రభావానికి గురవుతున్నారు.అంతర్జాతీయంగా ఇది అతిపెద్ద విపత్తు.
మిగతా దేశాలతో పోల్చుకుంటే, భారతదేశంలో ఈ కరోనా వైరస్ ప్రభావం తక్కువ అనే చెప్పాలి.ఇక మరణాల శాతం పోల్చుకున్నా, మిగతా దేశాల కంటే తక్కువగానే నమోదవుతున్నాయి.
దీనికి కారణం భారతీయులలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడమేనంటూ శాస్త్రవేత్తలు కూడా తేల్చి చెప్పేస్తున్నారు.ప్రస్తుతం ఈ కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే లాక్ డౌన్ నిబంధన ఒక్కటే మార్గమని అన్ని దేశాలు భావిస్తున్నాయి.
అదే విధంగా భారత దేశంలోనూ ఈ నిబంధనలను అమలు చేస్తున్నారు.మిగతా దేశాలతో పోల్చుకుంటే ఒక రకంగా మన దేశం ఈ విషయంలో కాస్తా మెరుగ్గానే ఉన్నట్లుగా కనిపిస్తోంది.
అయితే 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కరోనా కారణంగా ఇబ్బంది లేని వారు కొద్ది మంది మాత్రమే ఉన్నారు.
ఎందుకంటే నూటికి పది మంది మాత్రమే ఆర్థిక ఇబ్బందులు లేని వారు ఉండగా, మిగతా వారంతా పేద, మధ్యతరగతి వర్గానికి చెందినవారే.
దీంతో ఇప్పుడు మన దేశ ఆర్థిక పరిస్థితి గురించి ప్రపంచ దేశాలు కూడా తెలుస్తోంది.మిగతా దేశాలలో పరిస్థితి వేరు, మన దేశ పరిస్థితి వేరు.అక్కడ డబ్బులు ఉన్నా, స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు.ఇంటి నుంచి సరుకులు తెచ్చుకునే అవకాశం లేకపోవడంతో ఆన్లైన్ ద్వారా అక్కడ సరుకులు సరఫరా జరుగుతోంది.
కానీ భారతదేశంలో అటువంటి పరిస్థితి లేదు.ఎక్కువశాతం మంది దిగువ మధ్య తరగతి, దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారే కావడంతో ఇప్పుడు భారతదేశంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎక్కువ మంది ఆకలితో అలమటిస్తున్నారు.ఇక వలస కూలీలు సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.ఇప్పటి వరకు ఓట్ల కోసమే ప్రజలు అన్నట్టుగా పరిస్థితులు తీసుకురావడంతో ఆర్థికంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది.ఇప్పుడు కరోనా వైరస్ కంటే ఆకలి బాధలు, ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవడమే అతిపెద్ద సమస్యగా భారతదేశానికి వచ్చి పడింది.మరికొంత కాలం ఈ లాక్ డౌన్ నిబంధన అమలు లో ఉండే అవకాశం ఉండడంతో.
ఆ తరువాత కూడా ఈ పరిస్థితి నుంచి కోలుకునేందుకు బాగా సమయం పట్టే అవకాశం ఉండటంతో, ప్రజలు మరికొంత కాలం దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మన దేశంలో కనిపిస్తోంది.ఇప్పుడు కరోనా కంటే ఈ ఆర్థిక, ఆకలి బాధలు గురించి జనాలు ఎక్కువగా భయాందోళన లు చెందుతున్నారు.