మంత్రి ఉత్తమ్ తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం: జడ్పిటిసి

సూర్యాపేట జిల్లా: రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోనే మండలంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని జడ్పిటిసి రాపోల్ నరసయ్య,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన వెంకట్ రెడ్డి అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం, దిర్శించర్ల గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మంజూరైన 25 లక్షలు రూపాయల నిధులతో సీసీ రోడ్డు,డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.మంత్రి సహకారంతో మండలంలోని అన్ని గ్రామాలలో మరింత అభివృద్ధి జరిగేలా చూస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో వెంకట సైదులు యాదవ్,మాగంటి జయమ్మ,జొన్నలగడ్డ చిన్నసైదులు,పడిగపాటి సైదిరెడ్డీ,జలిల్,కర్నే సైదిరెడ్డీ,గోపాలరెడ్డి,కుర్రి శ్రీను,నన్నేపంగ శ్రీను,బుర్రి శ్రీను,ఆర్కె,అంకుష్,సునీల్తదితరుల పాల్గొన్నారు.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

Latest Suryapet News