నల్లగొండ, భువనగిరి ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మరోసారి నిరూపించుకుంది.

జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల్లోనూ విజయ దుందుభి మోగించి తన సత్తా చాటుకోవడమే కాకుండా కాంగ్రెస్ అభ్యర్థులుభారీ మెజార్టీలతో గెలుపు బావుటా ఎగరేసి,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గత రికార్డులను తిరగరాశారు.

ఈ విజయాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఇండియా కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు.నల్లగొండ పార్లమెంటు బరిలో నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డిపై 5,59,906 లక్షల ఓట్లతో విజయం సాధించి రికార్డు సృష్టించారు.

తెలంగాణ చరిత్రలో ఇదే భారీ మెజార్టీ కావటం గమనార్హం.ఈ విషయంతో జనారెడ్డి తన రాజకీయ వారసత్వాన్ని ఘనంగా ప్రారంభించారు.

ఇప్పటికే ఆయన చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.ఇక భువనగిరి పార్లమెంటు స్థానం నుండి బరిలో నిలిచిన చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఘన విజయం సాధించారు.

Advertisement

కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పై 2 లక్షల,22 వేల 249 ఓట్లతో విజయం సాధించారు.గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు.ఇప్పటి వరకు దేశంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎంపీల్లో మూడో వ్యక్తి కూడా ఆయనే.1991లో కర్నూలు జిల్లాలోని నంద్యాల లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పీవీ 5.8 లక్షల పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్‌పై గెలుపొందారు.కాగా 2011లో కాంగ్రెస్‌ నుంచి కడప ఎంపీగా పోటీ చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 5.43 లక్షల మెజార్టీ సాధించగా ఆయన రికార్డును రఘువీర్ రెడ్డి బ్రేక్ చేశారు.ఇక తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన మూడో ఎంపీ పసునూరి దయాకర్.2015లో వరంగల్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పసునూరి దయాకర్ 4.59 లక్షల మెజార్టీతో విజయం సాధించారు.దీంతో రఘు వీర్ రెడ్డి దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీల్లో 3వ వ్యక్తిగా నిలిచారు.

ఇది కదా టాలీవుడ్ హీరోల రేంజ్.. బాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టెసి మరీ..
Advertisement

Latest Nalgonda News