నా ప్రతిజ్ఞ నెరవేరిందన్న కాంగ్రెస్ వీరాభిమాని...!

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజారంజక పాలన ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత,మాజీ కౌన్సిలర్ కొండగడుపుల సూరయ్య అన్నారు.

జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత పదేళ్ళుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగిందని, ఇక కాంగ్రెస్( Congress ) తో సామాజిక న్యాయం వస్తుందన్నారు.

రాష్ట్రంలో 90 ఎన్నికల సభలు నిర్వహించి, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన బాహుబలి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) అని కొనియాడారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా నెత్తి పెంచకుండా గుండుతోనే ఉంటానని ప్రతిజ్ఞ చేశానని,నేడు నా ప్రతిజ్ఞ నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు.

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి గెలుపును కానుకగా ఇచ్చి రుణం తీర్చుకున్నామని అన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Uttam Kumar Reddy, Komati Reddy Venkat Reddy )లకు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా సమానంగా మంత్రి పదవులు ఇవ్వడం హర్షదాయకంగా ఉందన్నారు.

Advertisement
How Modern Technology Shapes The IGaming Experience

Latest Suryapet News