Harish Rao : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బొంద పెట్టాలి..: హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు( Former Minister Harish Rao ) మండిపడ్డారు.కాంగ్రెస్ అంటేనే లీకులు, ఫేక్ న్యూస్ లని చెప్పారు.

అక్రమ కేసులతో కాలయాపన చేస్తున్నారన్నారు.ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) ను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్( KCR ) బయటకు రాగానే కాలువల్లో నీళ్లు పారుతున్నాయన్న హరీశ్ రావు ఏనాటికైనా కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని చెప్పారు.ఎన్నికల కోడ్ సాకుతో హామీలు అమలు చేయడం లేదన్న ఆయన కొందరు బీఆర్ఎస్( BRS ) నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లి పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ క్రమంలో దానం నాగేందర్, కడియం, కావ్య, రంజిత్ రెడ్డి, సునీతకు మూడో స్థానమే దక్కుతుందని తెలిపారు.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు