తెలంగాణ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది .వచ్చే ఎన్నికల్లో ఏదో విధంగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉంది .
గతంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానికి పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలే కారణం అని గుర్తించిన ఆ పార్టీ నాయకులు, ఇప్పుడు సమిష్టిగా బీఆర్ఎస్ ,( BRS party ) బిజెపి( BJP party )లను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు.
అలాగే కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో , అప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ లోనూ ఉత్సాహం కనిపిస్తోంది.కర్ణాటక ఫార్ములానే తెలంగాణలోనూ అమలు చేసి సక్సెస్ అవ్వాలనే ఆలోచనతో ఉన్నారు.
దీనిలో భాగంగానే చేవెళ్లలో ఈరోజు కాంగ్రెస్ ప్రజా గర్జన సభను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. చేవెళ్లలోని కె.వి.ఆర్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షించాలని కాంగ్రెస్ భావిస్తోంది.ఈ సభ ఏర్పాట్లను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Bhatti Vikramarka ) పర్యవేక్షిస్తూ, పార్టీ నేతలకు ఈ సభ ఏర్పాట్లపై సూచనలు ఇస్తున్నారు.ఈరోజు సాయంత్రం 4.50 గంటలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. ఈ సభలో పార్టీకి సంబంధించిన ఎన్నో తీర్మానాలు చేయబోతున్నారు.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై మల్లికార్జున్ ఖర్గే ప్రకటించనున్నారు.చేవెళ్ల సభను విజయవంతం చేసే విధంగా కాంగ్రెస్ కీలక నాయకులంతా ప్రకటనలు చేస్తున్నారు.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ( V Hanumanthrao )వంటి వారు చేవెళ్ల ప్రజా గర్జన సభను విజయవంతం చేయాలని కోరుతూ.
పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి వి హనుమంతరావు పరిశీలించారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు.
ఈ సభలోనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడంతో పాటు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమేం చేయబోతోంది అనే విషయాల పైన కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వబోతోంది. అందుకే ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సక్సెస్ చేసే విధంగా ఈ సభ పైనే అంతా దృష్టి సారించారు.