బ్రిక్స్ కూటమిని విస్తరించాలని చైనా వివిధ దేశాలపైన ఒత్తిడి పెంచుతోందన్న విషయం అందరికీ తెలిసినదే.ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ కీలక ప్రకటన చేసి చైనాకు ఝలక్ ఇచ్చారు.
సభ్యదేశాల ఏకాభిప్రాయంతో ‘బ్రిక్స్’ కూటమిని విస్తరిస్తే దానికి భారత్ పూర్తిగా మద్దతు ఇస్తుందని చెబుతూనే, ఈ క్రమంలో ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా కూడా విస్తరణ చేయకూడదని హెచ్చరించారు.ఇక చైనా కొన్నేళ్లుగా పేద దేశాలకు ఆర్థికసాయం, రుణ సాయం, పెట్టుబడుల పేరుతో ఆయా దేశాలకు దగ్గరయ్యే యత్నం చేస్తోంది.
శ్రీలంక, పాకిస్తాన్, తైవాన్, ఆఫ్రికా దేశాల్లో ఇలాగే పట్టు సాధించింది చైనా.
![Telugu Brics Summit, Chinas, Brics, India, Latest, Modi, Vladimir Putin-Latest N Telugu Brics Summit, Chinas, Brics, India, Latest, Modi, Vladimir Putin-Latest N](https://telugustop.com/wp-content/uploads/2023/08/BRICS-Summit-23-latest-news-viral-latest-news-viral-Modi-suppressed-Chinas-pride-BRICS-india.jpg)
ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో రోడ్ల నిర్మాణం పేరుతో భారత ఆంతరంగిక వ్యవహారాల్లో తలదూర్చాలని కుయుక్తులు పన్నుతోంది.ఇలా ప్రపంచ వ్యాప్తంగా తన ఆధిపత్యం పెంచుకోవడమే లక్ష్యంగా బ్రిక్స్ విస్తరణకు సభ్య దేశాలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్( Xi Jinping ) ఒత్తిడి చేయడం జరుగుతోంది.తాజాగా దక్షిణాఫ్రికాలోని జోహెనస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో మరోమారు విస్తరణ అంశం తెరపైకి తీసుకు వచ్చారు.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వేదికగా బ్రిక్స్ కూటమిలో ఈ బుధవారం నిర్వహించిన శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ( Narendra Modi ) ప్రసంగించిన సంగతి విదితమే.
![Telugu Brics Summit, Chinas, Brics, India, Latest, Modi, Vladimir Putin-Latest N Telugu Brics Summit, Chinas, Brics, India, Latest, Modi, Vladimir Putin-Latest N](https://telugustop.com/wp-content/uploads/2023/08/viral-latest-news-viral-Modi-suppressed-Chinas-pride-BRICS-india-Vladimir-Putin.jpg)
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని రంగాల్లో ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా బ్రిక్స్ దేశాలు ముందుకు సాగాలని సూచించారు.అంతరిక్ష, విద్య, సాంకేతికత రంగాల్లో బ్రిక్స్ దేశాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.ఆ తరువాత చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ మాట్లాడుతూ.
బ్రిక్స్( BRICS ) కూటమిలో చేరేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలన్ని కలిసి రావాలని పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్( Vladimir Putin ) బ్రిక్స్ సదస్సుకు ఒక వీడియో సందేశాన్ని పంపారు.
ఉక్రెయిన్ పై రష్యా చేసిన దాడిని ఆయన ఈ సందర్భంగా సమర్ధించుకున్నారు.రష్యాకు అండగా ఉండాలని బ్రిక్స్ దేశాలను కోరారు.
ఉక్రెయిన్‌లో యుద్ధానికి పశ్చిమ దేశాలే కారణమని కూడా ఆరోపించారు.