సమగ్ర శిక్ష ఉద్యోగుల ఒంటికాలిపై నిలబడి నిరసన

రాజన్న సిరిసిల్ల: ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ బుధవారం ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు.

వినూత్న నిరసన కార్యక్రమంలో భాగంగా బుధవారం 16 వ రోజు కలెక్టర్ ఆఫీస్ చౌరస్తా వద్ద ఉద్యోగులంతా ఒంటి కాలి పై నిలబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలంటూ నినదించారు.

విద్యాశాఖలో కీలకంగా ఉంటూ రెగ్యులర్ ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోకుండా కష్టపడుతున్నామని వారు పేర్కొన్నారు.ప్రభుత్వం వెంటనే వారిని రెగ్యులర్ చేయాలని, అంతవరకు పే స్కేల్ విధానం అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.

నేడు దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ..
Advertisement

Latest Rajanna Sircilla News