రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా వారి ఫోటోకు నివాళులు అర్పించి దేశానికి వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి జీవితాన్ని దేశం కోసమే అర్పించిన గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి అని ఈ సందర్భంగా మండల నాయకులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మెరుగు అంజా గౌడ్, జిల్లా సభ్యత్వ నమోదు కన్వీనర్ మల్లారపు సంతోష్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి ,మండల ప్రధాన కార్యదర్శి బాదా నరేష్ , సీనియర్ నాయకులు చిట్టినేని శ్రీనివాసరావు, ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు చిగురు వెంకన్న, మండల ఉపాధ్యక్షులు ఎదునూరు గోపి, తిరుపతి, కోల కృష్ణ, చీకోటి మహేష్, జిల్లెళ్ల మల్లేశం, ఓరుగంటి సత్యం దీటి సత్తయ్య,మీసా శంకర్, మీసా స్వామి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News