సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల పూడికతీత పనులు ప్రారంభం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సాగు నీటి రైతుల వరప్రదాయిని అయిన సింగ సముద్రం సాగు నీటి కాలువల పూడికతీత పనులు సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల పూడికతీత చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్, బోప్పపుర్ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు.

రెండు కిలోమీటర్ల మేర హిటాచి జేసిబి మిషన్ తో తీసే పనులను ప్రారంభించారు.

సాగునీటి కాలువల పూడికతీత పనుల కోసం రైతులు ఏకరాన వేయి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని ఒగ్గు బాలరాజు యాదవ్ తెలిపారు.కాలువ పూడికతీత సమయంలో ఏకరాన వెయి రూపాయలు ఇవ్వాలని ఇప్పుడు ఇవ్వకుంటే వడ్లు కాంటా వేసే సమయంలో ఎకరాన రెండు వేల రూపాయలు కొనుగోలు కేంద్రంల వద్ద డబ్బులు తీసుకోవడం జరుగుతుందని రైతులు నిర్ణయించినట్లు ఒగ్గు బాలరాజు యాదవ్ తెలిపారు .రైతుల సమిష్టి సహకారం తో సాగు నీటి తో పంటలు పండించుకుందామని అన్నారు.ఈ కార్యక్రమంలో బోప్పాపుర్ ఉపసర్పంచ్ వంగ బాపు రెడ్డి, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు బాలయ్య గారి గోపాల్ రెడ్డి, చల్ల మహేందర్ రెడ్డి,జీడి రాజు యాదవ్,గుడి విఠల్ రెడ్డి వోలాద్రి, నారాయణ రెడ్డి, పేంజర్ల సత్తయ్య యాదవ్,గుడి సత్యం రెడ్డి,యూత్ కాంగ్రెస్ మాజీ మండల అద్యక్షులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్, ఇట్టం అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News