ప్రజా పాలన కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ...!

సూర్యాపేట జిల్లా: చివ్వెంల మండలం వట్టి ఖమ్మంపహాడ్ గ్రామంలో రైతు వేదిక వద్ద జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తుల పరిశీలించారు.

దరఖాస్తులోని అంశాలను కలెక్టర్ స్వయంగా అవగాహన పరిచారు.ప్రతి దరఖాస్తును రిజిస్టర్లో నమోదు చేయాలని, దరఖాస్తులన్నీ జాగ్రత్తగా భద్రపరచాలని,గ్రామ సభలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలన్నారు.

ప్రజలను నుండి దరఖాస్తులను ఒక క్రమ పద్ధతిలో స్వీకరించాలని తెలిపారు.ప్రజా పాలన సభల వద్ద ఏర్పాటుచేసిన హెల్ప్ డస్కులలో దరఖాస్తుదారులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని,గ్రామంలో 764 కుటుంబాలకు గాను 452 దరఖాస్తులు ఇప్పటివరకు అందజేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మి, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
ఆరోగ్యానికి వరం బొప్పాయి.‌. కానీ ఇలా తింటే చాలా డేంజర్..!

Latest Suryapet News