నడిగూడెం మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన...!

సూర్యాపేట జిల్లా: గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించడంతో మండల పరిస్థితులు తెలుసుకునే క్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.

వెంకట్రావు మంగళవారం నడిగూడెం మండలంలో ఆకస్మికంగా పర్యటించారు.

ఈ సందర్భంగా స్థానిక తాహాసిల్దార్ కార్యాలయం నందు మండల అధికారులు,ప్రజా ప్రతినిధులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.గ్రామపంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నందున గ్రామాలలో శానిటేషన్,మంచినీటి సౌకర్యం,వీధిలైట్ల ఏర్పాటు,పల్లె ప్రకృతి నిర్వహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

Collector S Venkatrao Sudden Inspection In Nadigudem Mandal, Collector S Venkatr

ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.ధరణి పోర్టల్ ద్వారా అన్ని రకముల మాడ్యూల్స్, టిడిపిలు ధరణి ట్రాన్సాక్షన్స్,భూ సమస్యలు పెండింగ్ లో ఉన్నట్లయితే వెంటనే పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు.

ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలన్నారు.ఎలక్షన్ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు.

Advertisement

మనఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.పాఠశాలలో శిధిలావస్థలో ఉన్న తరగతి గదులలో విద్యార్థులను కూర్చోబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు నిర్లక్ష్య వహించకుండా త్వరితగతిన పూర్తయ్యే విధంగా చూడాలన్నారు.వర్షాలు భారీగా కురుస్తున్నందున మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరాన్ని బట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

అనంతరం మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు.పాఠశాలలో తరగతి గదిలోకి వెళ్లిన జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరీక్షించారు.

తరగతి గది సౌకర్యాలను,పాఠశాల స్థితిగతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు యాతాకుల జ్యోతి, సర్పంచ్ గడ్డం నాగలక్ష్మి, తాహాసిల్దార్ నాగేశ్వరరావు, ఎంపీడీవో ఎం.ఎర్రయ్య,ఎంపీఓ వై.లింగారెడ్డి,ఎంఈఓ సలీం షరీఫ్,ఆర్ఐలు గోపాలరావు,షేక్ బాబా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభన్ బాబు, ఉపాధ్యాయులు, తాహాసిల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇంటి పన్ను కట్టని ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది ధర్నా
Advertisement

Latest Suryapet News