నూతనకల్ మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

సూర్యాపేట జిల్లా( Suryapet District ): నూతనకల్ మండలంలో మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్( District Collector Tejas Nandalal Power ) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం,ఎంపీడీవో,ఎమ్మార్వో కార్యాలయాలు, జిల్లా పరిషత్ పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసి రికార్డులను, పరిసరాలను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే గర్భిణీలు,రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని,24 గంటలు డాక్టర్లు,నర్సులు అందుబాటులో ఉంటూప్రతి గర్భిణీని నార్మల్ డెలివరీకి ప్రోత్సహిస్తూ, అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు.విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.ఎంపీడీవో ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కౌంటర్ ని సందర్శించి ప్రజలకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా ఆరు గ్యాంరంటీల్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత కరెంటు,రూ.500 లకే గ్యాస్ అందేవిధంగా చూడాలన్నారు.గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Collector Conducts Surprise Inspections In Nutanakal Mandal , Suryapet Distri

అనంతరం అంగన్ వాడి సెంటర్ లో రికార్డులు పరిశీలించి, పాఠ్యపుస్తకాలు,గర్భిణీలకు పిల్లలకు అందించే భోజనం,బియ్యం,పప్పు పరిశీలించారు.నాణ్యమైన ఆహారం,స్వచ్ఛమైన పాలు,గుడ్లు ఇవ్వాలన్నారు.

జిల్లా పరిషత్ పాఠశాలలో పర్యటించి,డిజిటల్ బోధన పాఠశాలలపై విద్యార్థులకు అవగాహన కల్పించి విద్యార్థులకు బోధన చేశారు.విద్యార్థుల నుండి సమస్యలు తెలుసుకున్నారు.

Advertisement

ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్స్ పెంచేవిధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు భాద్యత తీసుకోవాలన్నారు.హాజరు శాతం పెంచాలని,10 వ తరగతిలో ఉత్తిర్ణత 100 శాతం వచ్చేలా కృషి చాయాలన్నారు.

ఈకార్యక్రమంలో ఎంపీడీవో సునీత, ( MPDO Sunita)ఎమ్మార్వో శ్రీనివాసరావు, ఎంఈఓ రాముల నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News