టెన్షన్ పెడుతున్న లోకేష్ .. మంగళగిరి పై జగన్ సర్వే ?

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలన్నీ 2024 ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి.రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే అధికార ప్రతిపక్ష పార్టీలు అనేక వ్యూహాలను రచిస్తూ, ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

 Cm Jagan Survey On Mangalagiri Constituency Nara Lokesh Details, Nara Lokesh, Td-TeluguStop.com

రకరకాల కార్యక్రమాల పేరుతో జనాలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.రెండోసారి అధికారంలోకి రావాలని వైసిపి గట్టిగా ప్రయత్నం చేస్తుండగా, టిడిపి సైతం 2024 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

రాబోయే ఎన్నికల్లో గెలుపోటములపై అన్ని పార్టీలు సర్వేలు చేయించుకుంటూ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.ముఖ్యంగా కీలక నాయకుల నియోజకవర్గాల్లో ఈ సర్వేలు ఎక్కువగా జరుగుతున్నాయి.

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేయాలని భావిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఈ మేరకు ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ? ప్రస్తుత వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని 2024 ఎన్నికల్లో పోటీకి దింపితే పరిస్థితి ఎలా ఉంటుంది ? లోకేష్ ఈ నియోజకవర్గంలో ఎంత మేరకు పట్టు సాధించారు ఇలా అనేక అంశాలపై వైసీపీ సర్వే చేయిస్తోంది.ఇక మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ విస్తృతంగా పర్యటిస్తున్నారు.అన్ని మండలాలు గ్రామాల్లో తిరుగుతూ తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అలాగే మంగళగిరి పట్టణంలో అన్న క్యాంటీన్ ను తమ సొంత ఖర్చులతో తెలుగుదేశం పార్టీ పునరుద్ధరించింది.వీటన్నిటి పైన వైసిపి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.  తాడికొండ తోపాటు, మంగళగిరి నియోజకవర్గం అమరావతి ప్రాంతంలో ఉండడంతో, వైసిపి దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.2019 ఎన్నికల మాదిరిగానే 2024 ఎన్నికల్లోను లోకేష్ ను ఓడించడమే ధ్యేయంగా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Mangalagiri, Lokesh, Ysrcp, Ysrcpsurvy-Political

అందుకే ఈరోజు అనేక కోణాల్లో సర్వేలు చేస్తున్నట్లు సమాచారం.ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంది ? 2024 ఎన్నికల్లో ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ? ఈ నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థిగా మళ్లీ ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఛాన్స్ ఇస్తే విజయావకాశాలు ఎంతవరకు ఉంటాయి ? ఆయనకు ప్రత్యామ్నాయంగా మరో వైసీపీ నేత ను పోటీకి దింపితే ఫలితం ఎలా ఉంటుంది ? ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పునరుద్ధరించిన అన్న క్యాంటీన్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఇలా అనేక అంశాలపై జగన్ సర్వే చేస్తున్నట్లు సమాచారం.ఈ సర్వే నివేదికల ఆధారంగా మంగళగిరి పై మరిన్ని వ్యూహాలు రచించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube