మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేయాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా :పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ( Pollution Control Board)ఆద్వర్యంలో తయారు చేసిన 2 వేల మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు.

వినాయక చవితి ఉత్సవాల సందర్బంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆద్వర్యంలో తయారు చేసిన మట్టి గణపతి విగ్రహాలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదయంలోని తన ఛాంబర్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేతుల మీదుగా గురువారం పంపిణీ చేశారు.

సిరిసిల్ల, వేములవాడ( Sirisilla, Vemulawada ) పట్టణాలు, ఆయా గ్రామాల్లో విగ్రహాలు పంపిణీ చేయాలని సూచించారు.పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ భిక్షపతి, జీఎం ఇండస్ట్రీస్ భారతి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

వినూత్నంగా పుట్టినరోజు వేడుకలు 500 మందికి పైగా పిల్లలకు పండ్ల పంపిణీ
Advertisement

Latest Rajanna Sircilla News