బాధిత కుటుంబానికి చేయూత - ఐదువేల ఆర్థిక సహాయం అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇటీవల ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ లో పారిశుధ్య కార్మికుడీ గా పనిచేస్తూ అకాల మరణం చెందిన రేసు బాబు కుటుంభానికి స్థానిక చేయూత మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, 5వేల నగదును బాబు భార్య అనిత కు అందజేశారు.

బాబు మృతి పట్ల చేయూత మిత్ర ఫౌండేషన్ సభ్యులు తీవ్ర సంతాపం తెలిపారు.

భవిష్యత్ లో పిల్లల చదువుల కోసం అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా చేయూత మిత్ర ఫౌండేషన్ సభ్యులు ఒగ్గు బాలరాజు యాదవ్ మాట్లాడుతూ బాబు గ్రామంలో పారిశుధ్య కార్మికుడి గా పనిచేసి అతి చిన్న తనంలో మంచి పేరు తెచ్చుకున్నాడు అని బాలరాజు యాదవ్ అన్నారు.

గ్రామంలో గల కిరాణా, బట్టల దుకాణం ల ఇతర వాణిజ్య దుకాణాల యజమానులు మానవతా దృక్పథంతో ఆలోచించి బాబు కుటుంభానికి అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అద్యక్షులు దుస శ్రీనివాస్, సభ్యులు బందారపు లక్ష్మా రెడ్డి, కొర్రి అశోక్,బాధ గోపి సాదు సాయి రెడ్డి, కదిరే రవి, బుర్క దర్మెందర్,మంగురాపు అశోక్,రేసు కిషన్,రేసు జగన్ తదితరులు పాల్గొన్నారు.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement

Latest Rajanna Sircilla News