నిరాహార దీక్షకు దిగిన చంద్రబాబు

ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 12 గంటల నిరాహార దీక్షకు కూర్చున్నారు.నేడు ఛలో ఆత్మకూరుకు టీడీపీ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.

అయితే ఛలో ఆత్మకూరుకు ప్రభుత్వం నుండి అనుమతులు రాలేదు.ఆత్మకూరులో అంతా బాగానే ఉన్నా టీడీపీ నాయకులు రాజకీయం చేసే ఉద్దేశ్యంతో కుట్రలు పన్నుతున్నారు అంటూ వైకాపా నాయకులు ఆరోపించడంతో పోలీసులు ఛలో ఆత్మకూరుకు అనుమతించలేదు.

అనుమతి లేకున్నా కూడా ఆత్మకూరు వెళ్లేందుకు తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ప్రయత్నించారు.రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు.

ఇక చంద్రబాబు నాయుడును ఆయన ఇంటి నుండి బయటకు రాకుండా పోలీసులు నిర్భందించారు.దాంతో బాబు తన ఇంట్లోనే 12 గంటల నిరాహార దీక్షకు కూర్చున్నాడు.

Advertisement

ఇక బాబును కలిసేందుకు వస్తున్న తెలుగు దేశం పార్టీ ముఖ్య నేతలను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు.ఇంటి వద్ద పోలీసుల హడావుడిపై లోకేష్‌ పైర్‌ అయ్యాడు.

ఈ విషయమై పోలీసులకు లోకేష్‌కు వాగ్వివాదం జరిగింది.మొత్తానికి ఛలో ఆత్మకూరు క్యాన్సిల్‌ అయ్యి చంద్రబాబు దీక్షకు దారి తీసింది.

Advertisement

తాజా వార్తలు