గుంతల మయమైన సిసి రోడ్డు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని 8 వార్డులో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కు వెళ్లే సిసి రోడ్డు గుంతల మాయంగా మారింది దీన్ని గ్రామపంచాయతీ స్పెషల్ అధికారులు పట్టించుకోవడం లేదు గ్రామ సర్పంచి పదవి కాలం ముగియవడంతో దీనిపై శ్రద్ధ లేకుండా పోయింది గతంలో వైఫై ఇంటర్నెట్ కలెక్షన్ కోసం రోడ్లను తవ్వి ఇంటర్నెట్ సేవలకు ఉపయోగించారు కానీ రోడ్డును మరమ్మర్తులు మాత్రం చేపియ్యలేదు దీనితో ఇటు దేవాలయానికి మరియు గ్రామ ప్రజలకు వాహనాలకు ఈ రోడ్డు ఇబ్బందిగా మారింది అలాగే మార్కండేయ స్వామి దేవాలయం నుండి పెరిక వాడ వెళ్లే రహదారి కూడా గుంతలోగా మాయమైంది గ్రామ ప్రజలు, ప్రయాణికులు మాట్లాడుతూ గ్రామంలో గుంతలుగా ఏర్పడ్డ సిసి రోడ్లను మరమ్మర్తులు చేయాలని గ్రామపంచాయతీ స్పెషల్ అధికారికి సమాచారం ఇవ్వగా పట్టించుకోవడం లేదు.

ఇప్పటికైనా ఈ రోడ్లను మరమ్మర్తులు తక్షణమే చేసి ప్రయాణికులకు,గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని గ్రామస్తులు, ప్రయాణికులు కోరుతున్నారు.

Latest Rajanna Sircilla News