పోలీసు సైరన్ వాడుతున్న వ్యక్తి పైన కేసు నమోదు, వాహనం సీజ్..

రాజన్న సిరిసిల్ల జిల్లా: తేదీ.23/7/2024 మంగళవారం రోజున సాయంత్రం రుద్రంగి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బాబు రెడ్డి, సిబ్బంది రుద్రంగి గ్రామంలో పెట్రోలింగ్ చేస్తుండగా పోలీస్ సైరన్ ధరించి సైరన్ వేసుకుంటూ ప్రజలను పోలీసుల వలే సైరని వేసుకొని భయభ్రాంతులకు, పోలీసులు మోసం చేస్తూ వస్తున్న ఒక డజర్ ట్రాక్టర్ నెం : టి ఎస్ 35 టి 7256 గమనించి పట్టుకొని పంచుల సమక్షంలో ఆ డోజర్ ట్రాక్టర్ ని పంచనామ నిర్వహించి , అక్రమంగా పోలీస్ సైరన్ ని వాడుతున్న డ్రైవర్ లావుడియా దినేష్ S/o.

సంతోష్ ,అంబర్పేట తండా, కథలాపూర్ మండలం, యజమాని కున్సోత్ అంగూర్, పోలీస్ సైరన్ ను తెలిసి కూడా సాధారణ వ్యక్తులకు సైరన్ అమ్మినందుకు దుకాణం యజమాని సాయి శ్రీ కార్ డెకార్ యజమాని శ్రీధర్ రావు పైన కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని తెలిపారు.ఎవరు కూడా అక్రమంగా పోలీస్ గుర్తులు, సైరన్, పోలీసు లైట్లు వాడరాదు ఎవరైనా వాడిన వారి పైన కఠిన చర్యలు తీసుకొనబడతాయని తెలిపారు.

Latest Rajanna Sircilla News