కబ్జాలో లేని భూమి అమ్మి బెదిరింపులకు పాల్పడిన మరో వ్వ్యక్తిపై కేసు, రిమాండ్ తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా :కబ్జాలో లేని భూమి అమ్మి బెదిరింపులకు పాల్పడిన మరో వ్వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపిన డీఏస్పీ నాగేంద్ర చారి( DSP Nagendra Chari ) తెలిపారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన కొంపల్లి విజయను మోసం చేయాలని ఉద్దేశ్యంతో 2022 వ సంవత్సరంలో కోనరావుపేట( Konaraopet) మండల కేంద్రంలో తమ కబ్జాలో లేని భూమిని తమదిగా నమ్మించి, 20 లక్షల రూపాయలు తీసుకోని, ఎక్కడ కూడా కబ్జాలో లేని 24 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసి, తదుపరి భూమి హద్దుల విషయమై అడుగగా తప్పిoచుకొని తిరుగుతూ, ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన మంత్రి రఘు అను వ్యక్తి తాను మాజీ నక్సలైట్ అని, మరొకసారి డబ్బుల విషయమై ఇబ్బందులకు గురిచేస్తే చంపివేస్తానని బెదిరిoపులకు పాల్పడగా అట్టి ముస్తాబద్ మండలం అవునూర్ గ్రామానికి చెందిన రఘు ని గతలో కొనరావుపేట్ పోలీసులు రిమాండ్ కి తరలించడం జరిగిందని రఘు కి సహకరీంచిన మరొక వ్యక్తి అయిన ఇనుగంటి శ్రావణ్ రావు @ టిoకూ s/o లక్ష్మణ్ రావు, నివాసం: అల్వాల్, కూడా తనకు చాలా పలుకుబడి ఉందని, అట్టి డబ్బుల విషయమై మరల అడిగితే మీ అంతు చూస్తానని బెదరింపులకు పాల్పడగా విజయ పిర్యాదు మేరకు శ్రావణ్ రావు @ టిoకూకేసు నమోదు చేసే ఇనుగంటి శ్రావణ్ రావు @ టిoకూ s/o లక్ష్మణ్ రావు అను వ్యక్తిని కోనరావుపేట పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

ఇందుకు సహకరించిన ఇతర వ్యక్తులపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నది, ఎవరైనా ఇనుగంటి శ్రావణ్ రావు @ టిoకూ s/o లక్ష్మణ్ రావు చేత మోసపోయినట్లైయితే తమను సంప్రదించాలని డిఎస్పి తెలిపారు.

Latest Rajanna Sircilla News