నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం

రాజన్న సిరిసిల్ల జిల్లా :మణిపూర్( Manipur ) రాష్ట్రంలోని బాధితులకు న్యాయం చేయాలని ప్రధానమంత్రి మోదీ( Narendra Modi ) దిష్టిబొమ్మను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం దహనం చేశారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో గత మూడు నెలల నుండి రావణ కాష్టం జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.

ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగింపుగా నడి వీధులు తింపి అత్యాచారం చేసి చంపడం రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధం అన్నారు.మణిపూర్ లో ఉన్న రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరపు చేయాలని డిమాండ్ చేశారు.

Burn Effigy Of Narendra Modi-నరేంద్ర మోడీ దిష్ట�

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్ ,బీసీ సెల్ అధ్యక్షులు అనవేని రవి, నాయకులు చెన్ని బాబు, రాజేందర్( Rajender ), గంట బుచ్చగౌడ్ ,తిరుపతి గౌడ్,పందిర్ల శ్రీనివాస్ గౌడ్ ,సతీష్ ,పోచయ్య, పొన్నాల అంజిరెడ్డి,వంగ మల్లారెడ్డి , రోడ్డ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

కోడి గుడ్లే కాదు బాతు గుడ్లు ఆరోగ్య‌మే.. వారానికి ఎన్ని సార్లు తినొచ్చంటే..?
Advertisement

Latest Rajanna Sircilla News