బీఆర్ఎస్ నాయకులను ఊరి పొలమేరల్లోకి రాకుండా తరిమికొట్టాలి

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పే బీఆర్ఎస్ నాయకులను ఊరి పొలిమేరల్లోకి రాకుండా తరిమి కొట్టాలని దేవరకొండ ఎమ్మెల్యే రామవత్ రవీంద్రకుమార్ అన్నారు.

మంగళవారం కొండమల్లెపల్లి మండల కేంద్రంలో పిసిసి మెంబర్, పిఏసిఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులను ఊరి పొలిమేరల్లో రానివ్వద్దని అనడం సిగ్గుచేటన్నారు.

ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనని, ఎలక్షన్లో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు.తెలంగాణ ఏర్పాటు అయినదే నీళ్లు, నిధులు,నియామకాల కోసమని,కానీ,కేసీఆర్ ఒక్క కుటుంబానికే అన్ని ఉద్యోగలు వచ్చాయని, తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు ఎలాంటి గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో రైతులు, కార్మికులు, కర్షకులకు, నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు.బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ 24 గంటల కరెంటు వస్తుందో నిరూపించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతుల ఆత్మహత్యలే ఎక్కువగా ఉన్నాయన్నారు.రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలపై ధర్నాలను దిగడం సిగ్గుచేటని, ప్రజలందరూ గమనిస్తున్నారని, తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని,ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని, పింఛన్ రూ.4000 పెంచుతామన్నారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ నాయక్, సర్పంచులు గడ్డం శ్రీరాములు,పంది శ్రీను, రుద్రమ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
రేపు వైన్ షాపులు మాంసం దుకాణాలు బంద్

Latest Nalgonda News