నేటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర

లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్( KCR ) ప్రచారానికి సిద్ధం అయ్యారు.ఈ మేరకు నేటి నుంచి ఆయన బస్సు యాత్రను చేపట్టనున్నారు.

 Brs Chief Kcr Bus Trip From Today ,kcr, Brs Chief Kcr , Bus Trip, Ts Politics,-TeluguStop.com

ఇవాళ్టి నుంచి సుమారు 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది.ఈ క్రమంలో నల్గొండ జిల్లా( Nalgonda District )లోని మిర్యాలగూడ నుంచి కేసీఆర్ యాత్ర ప్రారంభం కానుంది.సాయంత్రం 5.30 గంటలకు మిర్యాలగూడలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు.తరువాత రాత్రి 7 గంటలకు సూర్యాపేట పట్టణంలో కేసీఆర్ రోడ్ షో చేపట్టనున్నారు.

ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులతో ఆయన మమేకం కానున్నారు.

అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament elections ) బీఆర్ఎస్ అత్యధిక సీట్లను గెలవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.దాంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు.ఇందులో భాగంగా నీటి నిర్వహణ లేక పంటపొలాలు ఎండిపోవడం, ధాన్యానికి రూ.500 బోనస్ అమలు చేయకపోవడం, మహిళలకు ప్రతి నెల రూ.2,500 హామీని అమలు చేయకపోవడం వంటి పలు అంశాలపై కేసీఆర్ దృష్టి సారించారని తెలుస్తోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube