ఇటీవల కాలంలో సినిమా సెలబ్రిటీలతో సమానంగా బుల్లితెర నటీనటులు కూడా ప్రేక్షకులలో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఒకప్పుడు కేవలం బుల్లితెర సీరియల్స్ మాత్రమే చేసే వీరంతా ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తూ వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.
ఇలా సీరియల్ నటిగా యూట్యూబర్ గా ఎంతోమంది సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సీరియల్ నటి మహేశ్వరి( Maheswari ) ఒకరు.ఈమె శశిరేఖా పరిణయం, వదినమ్మ వంటి సీరియల్స్ లో నటించి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇకపోతే ఇటీవల ఒక అమ్మాయికి జన్మనిచ్చినటువంటి మహేశ్వరి రెండోసారి కూడా అమ్మగా మారారు.ఇటీవల మహేశ్వరి ఘనంగా సీమంతపు వేడుకలను( Maheswari Baby Shower ) జరుపుకున్నారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.అయితే తాజాగా ఈమె తల్లిగా మారారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే తన బిడ్డ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
తనకు పుట్టిన బిడ్డ అబ్బాయా, అమ్మాయా అనే విషయాన్ని మహేశ్వరి వెల్లడించలేదు.కానీ తన ఫేస్ కనపడకుండా కేవలం తన భర్త శివ( Shiva ) చేతిలో మహేశ్వరి చేయి అలాగే తన కుమార్తె హరిని అలాగే ఇప్పుడు జన్మించిన బిడ్డ చేతులు ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఇలా ఈమెకు సంబంధించిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే తనకు బాబు కావాలని పలు సందర్భాలలో మహేశ్వరి తెలియజేశారు మరి ఈమెకు బాబు పుట్టారా లేక పాప పుట్టారా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.