బ్రెజిల్ ఫుట్ బాల్ స్టార్ జూనియర్ నెయ్ మర్( Neymar Jr ) ఆన్ లైన్లో పేకాట ఆడి 1 మిలియన్ యూరోలు పోగొట్టుకున్నాడు.భారత కరెన్సీలో దాదాపు రూ.9 కోట్లు.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.నెయ్ మర్ తొడ కండరాల గాయంతో గత మూడు నెలలుగా ఫుట్ బాల్( Football ) ఆటకు దూరంగా ఉంటూ ఇంట్లోనే ఉన్నాడు.ఇక సరదా కోసం ఫ్రాన్స్ కేంద్రంగా నడుస్తున్న ఆన్ లైన్ ఫోకర్ గేమ్ లో( Online Poker ) మెంబెర్ గా ఉన్న నెయ్ మర్ బుధవారం రాత్రి పేకాట ఆడాడు.అయితే ఏకంగా పేకాటలో రూ.9 కోట్లు పోగొట్టుకున్నాడు.భారీ మొత్తంలో డబ్బులు పోవడంతో కలత చెంది ఏడవడం చూసే వారందరినీ ఆశ్చర్యపరిచింది.
కానీ కాసేపు ఏడ్చిన తర్వాత ముఖంలో చిరునవ్వు కనిపించగా అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.కాసేపు ఎవరికి అర్థం కాలేదు.కావాలనే సరదా కోసం అలా చేశానంటూ క్యాప్షన్ పెట్టాడు.పేకాట అన్నాక డబ్బులు రావడం లేదా డబ్బులు పోవడం మామూలే.కొన్నిసార్లు డబ్బులు పోగొట్టుకున్నానని.తిరిగి పేకాటలోనే మళ్లీ తాను పోగొట్టుకున్న డబ్బును తిరిగి గెలుచుకున్నట్లు నెయ్ మర్ తెలిపాడు.ఇలాంటివన్నీ మానవ జీవితంలో సహజం అని, ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్లాలని,
తప్పుడు డెసిషన్లు తీసుకొని ఏ పనులు చేయకూడదని ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే తిరిగి సంపాదించాలని చెప్పకనే చెప్పాడు.ఇక తన వ్యక్తిగత విషయానికి వస్తే ఫిఫా వరల్డ్ కప్ అనంతరం తొడ కండరాలకు గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుని కోరుకుంటున్నాడు.అయితే ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె, అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ లతో కలసి నెయ్ మర్ పారిస్ సెయింట్ జెర్మెన్( PSG ) క్లబ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.