తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాస్త్ర అంత రాబట్టిందా.. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?

బాలీవుడ్ చాలా కష్టాలను ఎదుర్కొంటుంది.ఒక్కటంటే ఒక్క హిట్ కూడా అందుకోలేక పోతుంది.

 Brahmastra's First Weekend Telugu Collections, Alia Bhatt, Brahmastra, Ranbir An-TeluguStop.com

ఈసారి అయినా సాలిడ్ కొట్టాలని అనుకుంది.ఈ క్రమంలోనే మరొక పెద్ద సినిమా బాలీవుడ్ నుండి రిలీజ్ అయ్యింది.

బ్రహ్మాస్త్ర ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.అయితే ఈ సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

ముందు నుండి బాగా ప్రొమోషన్స్ చేయడంతో ఈ సినిమాకు ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో అని ఆసక్తిగా ఎదురు చూసారు.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 9 వేలకు పైగానే స్క్రీన్ లలో రిలీజ్ అయ్యింది.

దీంతో అంతా అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ అందుకుంది.బ్రహ్మాస్త్ర సినిమా ఫస్ట్ డే ఏకంగా 75 కోట్లు రాబట్టి బాలీవుడ్ కు ఊపిరి పోసింది.

ఇక ఈ సినిమా తెలుగులో రాజమౌళి ప్రొమోషన్స్ చేయడంతో ఇక్కడ కూడా బజ్ ఏర్పడింది.అయితే ఇక్కడ పాజిటివ్ టాక్ రాలేదు.

అయినా కూడా ఫస్ట్ వీకెండ్ లో మాత్రం అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టి అందరిని ఆశ్చర్య పరుస్తుంది.తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా మొదటి వీకెండ్ 12 కోట్లు రాబట్టినట్టు తెలుస్తుంది.

Telugu Alia Bhatt, Bollywood, Brahmastra, Brahmastra Box, Ranbir Alia, Ranbir Ka

అయితే ఈ రోజు సోమవారం కాబట్టి అసలైన పరీక్ష ఈ రోజు నుండి స్టార్ట్ కానుంది.ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అయితే బయ్యర్లకు లాభాలు తెచ్చేలాగానే కనిపిస్తుంది.జక్కన్న ప్రొమోషన్స్ బ్రహ్మాస్త్ర కు కలిసి వచ్చింది.రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ అయ్యింది.400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించగా అమితాబ్ బచ్చన్, నాగార్జున కూడా కీలక పాత్రల్లో నటించారు.చివరి వరకు ఈ భారీ మొత్తం రాబడుతుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube