బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సాబేర బేగం -గౌస్ అధ్యక్షతన మార్కెట్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం గుండారం గ్రామంలో వ్యవసాయ ఉత్పత్తులు తడవకుండా భద్రపరచుకోవడానికి గోదాం నిర్మాణం చేయుటకు స్థలం కేటాయింపు కోసం, అలాగే మండలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేసుకోవాలని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రాంరెడ్డి, ఎల్లారెడ్డిపేట్ సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ సభ్యులు పొన్నాల తిరుపతిరెడ్డి, దారవత్ గణపతి ,గుల్లపల్లి లక్ష్మారెడ్డి, గంట చిన్న లక్ష్మి, మర్రి నారాయణరెడ్డి, చిట్టి బాలయ్య, మేడిపల్లి రవీందర్, కొంగరి కృష్ణారెడ్డి, ముత్యాల సత్యనారాయణ రెడ్డి, సుడిది రాజేందర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు.

Boppapur Agricultural Market Committee General Meeting, Boppapur Agricultural Ma
డైలీ మార్నింగ్ ఈ డ్రింక్ తాగితే నెల రోజుల్లో నాజూగ్గా మారతారు!

Latest Rajanna Sircilla News