రాజన్న ఆలయ ఈవో కార్యాలయం ముందు బిజెపి నాయకుల ధర్నా...!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ వసతి గదులపై పెంచిన జీఎస్టీ వెంటనే తగ్గించాలని పట్టణ బిజెపి అధ్యక్షుడు, కౌన్సిలర్ సంతోష్ బాబు ఆధ్వర్యంలో సోమవారం ఈవో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ దేవాలయాన్ని ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.వసతి గదులపై జిఎస్టి తగ్గించాలని కోరారు.

ఈవో కృష్ణ ప్రసాద్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో పిన్నింటి హన్మండ్లు,బిల్లా కృష్ణ, నామాల శేఖర్, అన్నారం శ్రీనివాస్, మల్లేశం, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement

Latest Rajanna Sircilla News