బిగ్ బాస్ సోహైల్ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. పక్కా మాసివ్ రోల్ లో

సీరియల్స్ లో కెరియర్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే ఫేమ్ తెచ్చుకున్న నటుడు సోహైల్.ఈ షో లో టాప్ 5లో ఒకరిగా నిలిచినా సోహైల్ ఫైనల్ కి వెళ్ళే అవకాశం ఉన్న డబ్బులు తీసుకొని డ్రాప్ అయిపోయాడు.

 Bigg Boss Telugu Fame Sayed Sohel Ryan New Movie Begins Shoot, Tollywood, Appire-TeluguStop.com

అయినా కాని యాక్టర్ గా మంచి ఫేం వచ్చింది.బిగ్ బాస్ తో వచ్చిన ఫేమ్ ని ఈ యువ నటుడు రెండు చేతులా ఉపయోగించుకొని హీరోగా నిలబడటానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

వచ్చిన తర్వాత అనుకున్నట్లుగానే జార్జ్ రెడ్డి తెరకెక్కించిన నిర్మాతలు సోహైల్ తో సినిమాని ఎనౌన్స్ చేశారు.అయితే తరువాత కొద్ది రోజుల పాటు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు.

అయితే సడెన్ గా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఇందులో పక్కా మాస్ లుక్ లో సోహైల్ కనిపిస్తున్నాడు.

అలాగే ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు.శ్రీనివాస్ వింజనంపాటి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

పూజా కార్యక్రమాలతో బుధవారం ప్రారంభమైన ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసింది.అప్పిరెడ్డి ప్రొడక్షన్ నెంబర్ 3గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో ఈ సినిమాని సరికొత్త పాయింట్ నేపధ్యంలో తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత అప్పిరెడ్డి తెలిపారు.ఇక ఈ సినిమాకి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.

నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.ఇందులో ఓ కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube