ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 8 ( Bigg Boss Season 8 )రసవత్తరంగా సాగుతోంది.

కొత్త కొత్త ట్విస్టులు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు.

ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లో నబిల్ ఏదైనా ఒక కోరికను కోరుకోమని బిగ్ బాస్ చెప్పగా అన్లిమిటెడ్ ఫుడ్ కావాలని కోరుకున్నాడు.కానీ బిగ్ బాస్ మాత్రం ఈవారం కావాల్సినంత ఫుడ్ ఇస్తానని తెలిపారు.

కానీ ఇంతలోనే మళ్లీ తిరకాసు పెట్టాడు.మరి తాజాగా బిగ్ బాస్ హౌస్ లో అక్టోబర్ 16 ఎపిసోడ్ లో ఏమేం జరిగాయి అన్న వివరాల్లోకి వెళితే.

విష్ణుప్రియ ( Vishnu Priya )తన మనసులోని బాధను చెప్పడంతో గంగవ్వ( Gangavva ) ఎమోషనల్ అయ్యింది.

Bigg Boss Telugu 8 Oct 16th Full Episode Review Naga Manikanta Offers Gold, Bigg
Advertisement
Bigg Boss Telugu 8 Oct 16th Full Episode Review Naga Manikanta Offers Gold, Bigg

అమ్మకు ఇష్టం లేదని చిన్నప్పటి నుంచి నాన్నతో మాట్లాడేవాళ్లం కాదు.నాన్నపై ఎంత ప్రేమ ఉన్నా, అమ్మ కోసం ఆయనతో మాట్లాడలేదు.చిన్నప్పుడే అమ్మానాన్న విడిపోయారు.

అది నా జీవితంలో జరిగిన ఘోరం ఇది ఎవరికీ జరగకూడదు.అమ్మ చనిపోయాక ఇప్పుడిప్పుడే తనతో మాట్లాడుతున్నాం అని చెప్పింది.

దాంతో విష్ణు ప్రియ మాటలు విన్న గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది.ఇకపోతే ఇన్ఫినిటీ రూమ్‌లో నబీల్‌ అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌ కావాలన్న సంగతి తెలిసిందేగా! దాని గురించి బిగ్‌బాస్‌ ప్రస్తావిస్తూ.

ఇంట్లో ఉన్నంతకాలం నబీల్‌ స్వీట్లు, కూల్‌డ్రింక్స్‌, చాక్లెట్లు త్యాగం చేస్తే ఈ ఒక్క వారం అన్‌లిమిటెడ్‌ రేషన్‌ లభిస్తుందని అన్నాడు.

Bigg Boss Telugu 8 Oct 16th Full Episode Review Naga Manikanta Offers Gold, Bigg
వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

ఇంటిసభ్యులందరి కోసం ఆ కండీషన్‌కు నబీల్‌ ఓకే చెప్పాడు.దీంతో మెహబూబ్‌ ( Mehboob )సూపర్‌ మార్కెట్‌లో ఉన్న రేషన్‌ అంతా ఊడ్చేశాడు.ఆ తర్వాత నాగమణికంఠ( Nagamanikantha ) తాను నామినేషన్స్‌లో నుంచి సేవ్‌ అయితే గంగవ్వకు బంగారు ముక్కుపుడక ఇస్తానని అన్నాడు.

Advertisement

సేవ్‌ అయిన ప్రతివారం అరతులం ఇస్తానంటూ గంగవ్వ మీద ఒట్టేశాడు.మరి నాకేం ఇస్తావని రోహిణి అనగా ఒక ముద్దిస్తానని అన్నాడు.ఇక అవినాష్‌ రోహిణి నామినేషన్స్‌ ను రీక్రియేట్‌​ చేసి నవ్వించారు.

వీరి పర్ఫామెన్స్‌ మెచ్చిన బిగ్‌బాస్‌ కిచెన్‌లో మరో రెండు గంటలు ఎక్కువ సేపు వంట చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు.

తాజా వార్తలు