Bigg boss : మళ్లి బిగ్ బాస్ మొదటికే వచ్చింది .. ఆ ఒక్కటి మాత్రమే దిక్కు

చాల సీజన్స్ గా బిగ్ బాస్( Bigg boss ) బోర్ కొడుతుంది అని, ఎవరికీ నచ్చడం లేదు అంటూ మనం చూస్తూనే ఉన్నాం.

జనాల్లో కూడా దీనిపై ఉన్న ఆ కాస్త ఇంట్రెస్ట్ పోతుంది.

ఈ సారి ఏడవ సీజన్ ఉల్టా పల్టా అంటూ నాగార్జున( Nagarjuna )ఎదో కొత్తగా చేయబోతున్నాం అంటూ ఊదరగొట్టిన అక్కడ పెద్దగా జరుగుతుంది మాత్రం ఏమి లేదు.కానీ ఈ సారి హౌస్ లో వీలైనంత అందమైన అమ్మాయిలను దింపి షో రక్తి కట్టించాలని మాత్రం చూస్తున్నట్టు గా తెలుస్తుంది.

అసలు అందాలు లేకపోతే ఇక బిగ్ బాస్ ని ఎవరు చూడరు అనేది మాత్రం నిజం.ఇప్పటికే ఈ షో పై, హోస్ట్ పై జనాల్లో బాగా వ్యతిరేఖత ఉంది.

మరి ఈ సారి కూడా అదే కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది.

Advertisement

హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుంచే పులిహోర కలపకపోతే ఎదో కొంపలు అంటుకు పోతాయి అన్నట్టుగా రతిక ప్రశాంత్ తో, డాక్టర్ బాబు తో మోనిత మరియు శుభ శ్రీ ఇంకా ఇలా ఇంకొన్ని రోజుల్లో మరి కొన్ని జంటలు అయ్యేలా కనిపిస్తున్నాయి.మరి పులిహోర ప్రోగ్రాం గా వర్ణించేందుకు ప్రోమో లో లవ్ సాంగ్స్ పెట్టి మరి వారి మధ్య ఎదో జరుగుతుంది అనేలా చూపిస్తున్నారు మా టీవీ వారు.ఇక నాగార్జున హోస్టింగ్ కూడా అలాగే చప్పగా నడుస్తుంది.

టేస్టీ తేజ( Tasty Teja ) కాస్త కామెడీ తో ఆకట్టుకుంటున్న అది ఎక్కడ సరిపోవడం లేదు.

ఇక కొంత మంది అయితే హౌస్ కి ఎందుకు వచ్చారో కూడా అర్ధం కావడం లేదు.వారు ఉన్నారా లేరా అనే విషయం తెలియడం లేదు.మొదలయ్యి వారం కూడా అవ్వకుండానే బోర్ గా జనాలు ఫీల్ అవుతున్నారు అంటే సీజన్లో అయిపోయేసరికి పరిస్థితి ఏంటో చూడాలి మరి.ఈ సారి హౌస్ లో జనాలు కూడా తక్కువే ఉన్నారు.వైల్డ్ కార్డు ఎంట్రీ లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు.

మరి వచ్చేవారైనా కాస్త ఆటలపై ద్రుష్టి పెట్టి జనాలను ఎంటర్టైన్ చేస్తారా లేక వచ్చి పులిహోర రాజాలు అయిపోతారు అనేది ప్రశ్నార్థంకంగా ఉంది.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు