ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాలలో మాత్రమే నటించి ఆ తర్వాత సరైన అవకాశాలు లేక సినిమా ఇండస్ట్రీకి దూరమైన వారు ఎంతోమంది ఉన్నారు.కేవలం ఒక్క సినిమా తోనే స్టార్ డమ్ ని సంపాదించుకొని ఆ తర్వాత సినిమాలకు దూరమైన వారు చాలామంది ఉన్నారు.
అటువంటి వారిలో హీరోయిన్ శరణ్య మోహన్( Saranya mohan ) కూడా ఒకరు.కాగా ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా నటించి మెప్పించింది.
అయితే తక్కువ సినిమాలలో నటించి ఆ తర్వాత సినిమాలకు దూరమైన శరణ్య మోహన్ ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భీమీలి కబడ్డీ జట్టు( Bheemili kabaddi jattu ) చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.కాగా ఈ చిత్రం 2010లో విడుదలైన విషయం తెలిసిందే.తక్కువ కాలంలోనే తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.
కల్యాణ్ రామ్ మూవీ కత్తి సినిమాలో ఆయనకు చెల్లెలిగా కనిపించింది.కానీ ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు.
ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు అరవింద్ కృష్ణన్( Saranya mohan Husband Arvind Krishnan ) ను పెళ్లి చేసుకుంది.
ఆమెకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు సంతానం కాగా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది.తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తన కూతురు ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అయితే నాని సినిమాలో నటించిన సమయంలో ఎంతో క్యూట్ గా ఉన్న ఈమెను ఇప్పుడు గుర్తుపట్టడం కాస్త కష్టమే అని చెప్పవచ్చు.
సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానులతో మాత్రం ముచ్చటిస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది.