బాణాసంచా పెల్చినందుకు అరెస్ట్ అయిన భారతీయుడు...!!!

భారతదేశంలో దీపావళి అంటే ఎంతో ప్రత్యేకమైన రోజు, ఆ రోజు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే టపాసుల మోత మొగిపోవాల్సిందే.

ఆ శబ్దాలు భరించలేని వాళ్ళు చెవులు మూసుకోవాల్సిందే.

కాలుష్యం అయినా ఏదైనా ఆ కాసేపు ఏమి గుర్తు ఉండదు.భారత్ లో ఆడింది ఆటగా పాడింది పాటగా అలాంటి రోజులు గడిపిన ఓ యువకుడు సింగపూర్ లో పాత స్మృతులు గుర్తు తెచ్చుకుని రెచ్చిపోయాడు.

కట్ చేస్తే.ప్రస్తుతం జైలు జీవితం అంచుల దాకా వెళ్లి బెయిల్ పై తిరిగి వచ్చాడు.

అది కూడా 2 లక్షలు పైగా డబ్బు చెల్లించి బెయిల్ తెచ్చుకున్నాడు.వివరాలోకి వెళ్తే.

Advertisement

అక్టోబర్ 27న సింగపూర్ లో ఉంటున్న ఓ మురుగన్ అనే యువకుడు దీపావళి పురస్కరించుకుని లిటిల్ ఇండియా ప్రాంతంలో బాణాసంచా పేల్చాడు.సింగపూర్ చట్టాల ప్రకారం సమస్యాత్మక ప్రాంతాలలో బాణాసంచా పేల్చడం నేరం కావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

అయితే.

తానూ కావాలని ఈ పని చేయలేదని, తనని బెయిల్ పై విడదల చేయాలనీ అతడు న్యాయమూర్తిని అభ్యర్ధించగా సమ్మతించిన కోర్టు 2 లక్షల పైగా పూచి కత్తుతో బెయిల్ ఇచ్చింది.విచారణలో అతడి నేరం రుజువయితే మాత్రం 2 ఏళ్ళ జైలు జీవితంతో పాటు 5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మట్టి ఇల్లు అని చులకనగా చూడకండి.. లోపల చూస్తే ఇంద్రభవనమే..?
Advertisement

తాజా వార్తలు