సాధారణంగా వయసు పైబడే కొద్ది చర్మం సాగి పోయి ముడతలు పడుతుంటుంది.దాంతో సాగిన చర్మాన్ని మళ్లీ టైట్‌గా, బ్రైట్‌గా మార్చుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తారు.
మార్కెట్‌లో లభ్యమయ్యే క్రీములు, సీరమ్‌లు, ఆయిల్స్ ఇలా ఎన్నో వాడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ సింపుల్ హోమ్ రెమెడీస్ ను పాటిస్తే గనుక చాలా సులభంగా సాగిన చర్మాన్ని టైట్‌గా మార్చుకోవచ్చు.
మరి ఎందుకు లేటు ఆ సూపర్ హోమ్ రెమెడీస్ ఏంటో ఓ లుక్కేసేయండి.
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక స్పూన్ మొక్క జొన్న పిండి, ఒక స్పూన్ కస్తూరి పసుపు, అర కప్పు నీళ్లు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్‌పై పెట్టి స్పూన్‌తో తిప్పుకుంటూ క్రీమ్‌లా అయ్యే వరకు వేడి చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్లు తయారు చేసుకున్న పసుపు-మొక్క జొన్న పిండి మిశ్రమం, ఒక స్పూన్ అవిసె గింజల జెల్, అర స్పూన్ రోజ్ వాటర్, రెండు విటమిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని, మెడకు అప్లై చేసి.
ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
రెండు రోజులకు ఒక సారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మం కొద్ది రోజుల్లోనే టైట్‌గా, గ్లోయింగ్‌గా మారుతుంది.
అలాగే మరో ప్యాక్ ఏంటంటే.ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్లు తయారు చేసుకున్న పసుపు-మొక్క జొన్న పిండి మిశ్రమం, ఒక స్పూన్ అలోవెర జెల్, ఒక స్పూన్ బాదం ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూసుకుని.
కాసేపు ఆరబెట్టుకోవాలి.ఆపై చల్లటి నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.
ఇలా తరచూ చేసినా సాగిన చర్మం టైట్‌గా మారుతుంది.మరియు మొటిమలు, నల్ల మచ్చలు ఉన్నా తగ్గు ముఖం పడతాయి.