అక్టోబర్ నెలలో( October ) విదేశాలకు వెళ్లాలనుకొనేవారు అక్టోబర్ నెలలో ఏయే దేశాలు మంచి వాతావరణంతో కూడుకొని వుంటాయి అని తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం.కొన్ని దేశాల్లో సంస్కృతి గురించి తెలుసుకోవడానికి అక్టోబర్ బెస్ట్ మంత్ అయితే మరికొన్ని దేశాలు అక్టోబర్ నెలలో పర్యాటకులకు( Tourists ) మంచి అనుభూతిని అందించే దేశాలు అవుతాయి.
ఇపుడు మనం అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.అందులో మొదటగా “జపాన్”( Japan ) గురించి మాట్లాడుకోవాలి.
అక్టోబరులో ట్రావెల్ చేయడానికి జపాన్‌లోని నిక్కో, క్యోటో, పర్యాటక ప్రదేశాలు ఉత్తమంగా నిలుస్తాయి.ఈ ప్రాంతాలలో చలికాలానికి ముందు ఆకులు ఎల్లో, ఆరెంజ్ వంటి రంగుల్లోకి మారుతాయి.
వాటి వల్ల ఆలయాలు, ఉద్యానవనాలు అద్భుతంగా కనిపిస్తాయి.

ఆ తరువాత “ఇటలీ”( Italy ) గురించి మాట్లాడుకోవాలి.అక్టోబర్ నెలలో ఇటలీలో పర్యాటకుల తాకిడి చాలా తక్కువగా ఉంటుంది.కాబట్టి అప్పుడు అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా వుంటుంది.
అందమైన టుస్కాన్ గ్రామీణ ప్రాంతాలను చూడవచ్చు, రోమ్ చారిత్రక, సాంస్కృతిక సంపదను అన్వేషించవచ్చు.అంతేకాకుండా రుచికరమైన ఇటాలియన్ ఫుడ్ ఆస్వాదించొచ్చు.
తరువాత ఈ నెలలో “పోర్చుగల్”( Portugal ) దేశంలో మంచి వాతావరణం ఉంటుంది.లిస్బన్, పోర్టో, అల్గార్వే వంటి ప్రదేశాలను విజిట్ చేసి పోర్చుగీస్ సంస్కృతి గురించి తెలుసుకోవచ్చు.

అలాగే “మొరాకో, వియత్నాం” దేశాల విషయానికొస్తే అక్టోబర్‌లో మొరాకో( Morocco ) వేసవిలో కంటే చల్లగా ఉంటుంది.వియత్నాంలో( Vietnam ) హ్యూ, హోయి ఆన్‌లోని పురాతనమైన, ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు.ఇక “యూఎస్ఎ”( USA ) గురించి దాదాపుగా అందరికీ తెలిసినదే.అక్టోబర్‌లో యూఎస్ఎకి వెళ్లి అద్భుతమైన అందాలను ఆస్వాదించవచ్చు.న్యూ ఇంగ్లాండ్‌లోని అందమైన ఆకులు రాలే దృశ్యాలను ఎంజాయ్ చేయవచ్చు.“స్పెయిన్” దేశం వెళ్లినవారు బార్సిలోనాలో లా మెర్సే లేదా సిట్జెస్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి సాంస్కృతిక ఉత్సవాలకు వెళ్లవచ్చు.
గొప్ప చరిత్ర, కళలతో అద్భుతంగా కనిపించే అండలూసియన్ నగరాలైన సెవిల్లె, గ్రెనడాల్లో తిరుగుతూ మరపురాని జ్ఞాపకాలను ఏర్పర్చుకోవచ్చు.అదండీ అసలు విషయం ఈ లిస్టులో ఎక్కడికి వెళ్లాలో ఇపుడే నిర్ణయించుకోండి.