బ్రతికితే భారమన్నారు.. వదిలించుకోవాలన్నారు.. ఈ ఆటిజం యువతి సక్సెస్ స్టోరీకి ఫిదా కావాల్సిందే!

పుట్టుకతోనే ఏదైనా వ్యాధి బారిన పడితే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సులువైన విషయం కాదు.అలాంటి చిన్నారులను పెంచే విషయంలో తల్లీదండ్రులకు సైతం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయనే సంగతి తెలిసిందే.

 Benzy Kumar Singer Success Story Details Here Geos Viral In Social Media ,auti-TeluguStop.com

అయితే తన కూతురు చలనం లేకుండా పుట్టినా ఒక తల్లి మాత్రం ఆ చిన్నారిని ఎంతో ప్రేమగా పెంచింది.చిన్నారి పుట్టిన సమయంలో కూతురులో ఎందుకు చలనం లేదో అర్థం కాక తల్లీదండ్రులు వైద్యుల చుట్టూ తిరిగారు.

ఆ సమయానికి ఈ వ్యాధి పేరు ఆటిజం( Autism) అని చాలామంది వైద్యులకు సైతం తెలియదు.వైద్యులు ఈ చిన్నారి అరుదైన వ్యాధితో బాధ పడుతోందని చెప్పారే తప్ప ఆ వ్యాధికి సంబంధించిన వివరాలు సైతం చెప్పలేదు.

అయితే చిన్నారి బంధువులు, సన్నిహితులు మాత్రం ఆ చిన్నారిని వదిలించుకోవాలని తల్లీదండ్రులకు ఉచిత సలహాలు ఇచ్చారు.ఆ చిన్నారి పేరు బెంజీ కుమార్ కాగా ఆ చిన్నారి తల్లి కృషి వల్ల ప్రస్తుతం ఉన్నత స్థాయికి ఎదిగింది.

Telugu Autism, Benzy Kumar, Kavita Kumar, National Awards, Story-Movie

బెంజీ కుమార్( Benzy kumar ) తల్లి కవితా కుమార్( Kavita Kumar) తన కూతురు సంగీతానికి స్పందిస్తుండటం గుర్తించి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు.శిక్షణ తీసుకున్న రెండేళ్లలోనే బెంజీ కుమార్ ప్రదర్శన ఇచ్చే స్థాయికి ఎదగడం గమనార్హం.బెంజీ కుమార్ 9 సంవత్సరాల వయస్సులోనే ప్రదర్శన ఇచ్చే స్థాయికి ఎదిగారు.తన గానంతో బెంజీ కుమార్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

Telugu Autism, Benzy Kumar, Kavita Kumar, National Awards, Story-Movie

కేవలం 27 సంవత్సరాల వయస్సులోనే బెంజీ కుమార్ కు మూడు జాతీయ అవార్డులతో పాటు ఎన్నో రివార్డులు వచ్చాయి.బెంజీ కుమార్ సక్సెస్ స్టోరీ తెలిసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

బ్రతికితే భారమని ఆమె గురించి కామెంట్లు చేసిన వాళ్లే ఇప్పుడు ఆమెను ప్రశంసిస్తున్నారు.బెంజీ కుమార్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube