ఆయిల్ స్కిన్‌ను నివారించే చార్కోల్‌..ఎలా వాడాలంటే?

ఆయిల్ స్కిన్‌ను నివారించుకునేందుకు ర‌క‌ర‌కాల క్రీములు, ఫేస్ వాష్‌లు, ఫేస్ ప్యాకులు, ఫేస్ మాస్కులు ఇలా ఎన్నో వాడుతుంటారు.కానీ, కొంద‌రికి ఇవేమి సంతృప్తిని ఇవ్వ‌లేవు.

అయితే అలాంటి వారు చార్కోల్ వాడ‌టమే ఉత్తమం అంటున్నారు సౌంద‌ర్య నిపునులు.చార్కోల్‌.మ‌న తెలుగు భాష‌లో చెప్పాలంటే బొగ్గు.

పూర్వం బొగ్గుతోనే దంతాలను తోముకునేవారు.అయితే దంతాల‌నే కాదు.చ‌ర్మాన్ని మిల‌మిల మెరిపించ‌డంలోనూ చార్కోల్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

ముఖ్యంగా ఆయిల్ స్కిన్‌ను త‌గ్గించ‌డంలో చ‌ర్కోల్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి చార్కోల్‌ను స్కిన్‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Beauty, Benefits Of Charcoal, Charcoal Face Packs, Charcoal, Charcoal For Skin,
Advertisement
Beauty, Benefits Of Charcoal, Charcoal Face Packs, Charcoal, Charcoal For Skin,

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చార్కోల్ పౌడ‌ర్ మ‌రియు వాట‌ర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ప‌ది లేదా ప‌దిహేను నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.రోజుకు ఒక సారి ఇలా చేస్తే.

చ‌ర్మంపై పేరుకుపోయిన అద‌న‌పు జిడ్డు మొత్తం తొల‌గిపోయి.ముఖం ఫ్రెష్‌గా, కాంతివంతంగా మెరుస్తుంది.

ఒక గిన్నెలో ఒక స్పూన్ చార్కోల్ పైడ‌ర్‌, ఒక స్పూన్ అలోవెర జెల్ వేసుకుని బాగా క‌లిసేలా మిక్స్ చేయాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు పూసి.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఇర‌వై నిమిషాల త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో చ‌ర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా వారంలో మూడు, నాలుగు సార్లు చేస్తూ ఉంటే.

Advertisement

మృత‌క‌ణాలు, జిడ్డు పోయి చ‌ర్మం తాజాగా మారుతుంది.

ఇక మొటిమ‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ చార్కోల్ యూజ్ అవుతుంది.ఒక బౌల్‌లో ఒక స్పూన్ చార్కోల్ పౌడ‌ర్‌, రెండు స్పూన్ల రోజ్ వాట‌ర్ వేసుకుని క‌లుపు కోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌లు ఉన్న చోటు పూసి.

పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్ చేస్తూ ఉంటే క్ర‌మంగా మొటిమ‌లు మ‌టుమాయం అవుతాయి.

తాజా వార్తలు