సూర్యాపేటలో ఎలుగుబంటి కలకలం

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో ఎలుగుబంటి( Bear ) ఆదివారం రాత్రి హల్చల్ చేసింది.ఓ ఇంట్లోకి ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

పట్టణంలో డిమార్ట్ వెనకాల నిర్మాణంలో ఉన్న భవనంలోకి గత రాత్రి ప్రవేశించిదని స్థానిక ప్రజలు వాపోతున్నారు.ముందుగా అక్కడ స్థానికంగా నివాసం ఉంటున్న తండు శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లోకి ఎలుగు బంటి రంగప్రవేశం చేసింది.

ఇంట్లో ఉన్న వారు చూసి భయాందోళనకు గురై కేకలు వేయడంతో వెంటనే ఆ ప్రాంతం నుండి పక్కనే ఉన్న గుండగాని రాములు ఇంట్లోకి ఎలుగుబంటి ప్రవేశించింది.అక్కడ ప్రజలు పోలీసులకు,అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సంఘటన స్థానానికి పోలీసులు,అటవీశాఖ అధికారులు ( Forest officials )చేరుకుని ఎలుగుబంటిని బంధించారు.అనంతరం దానిని పారెస్ట్ కు తరలించారు.

Advertisement

Latest Suryapet News