బీఆర్ఎస్ లో బీసీ బంధు లొల్లి...ఎంపీటీసీ రాజీనామా...!

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం త్రిపురావరం గ్రామంలోబీసీ బంధు( Bc bandhu ) పథకం అధికార బీఆర్ఎస్ పార్టీలో అగ్గి రాజేసింది.

బీసీ బంధులబ్ధిదారుల కోసం స్థానిక ఎంపీటీసీ కొత్త జానకి సూచించిన పేర్లు రాకుండా మండల పార్టీ అధ్యక్షుడు, ఎంపిపి సూచించిన వారికి ఇచ్చారని మనస్తాపానికి గురైన ఎంపీటీసీ జానకి( MPTC Janaki ) శుక్రవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

ఎంపిటిసి తన రాజీనామా పత్రాన్ని ఎంపీడీవోకు ఇవ్వడానికి వెళ్లగా అందుబాటులో లేకపోవడంతో ఎంపీపీకి, ఎమ్మెల్యేకు రాజీనామా పత్రాన్ని అందించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ మండల పార్టీ అధ్యక్షుడు,ఎంపీపీ వర్గీయులకే బీసీ బంధు వచ్చిందని,నన్ను నమ్ముకున్న ఐదుగురు వ్యక్తుల పేర్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

BC Bandhu Lolli In BRS...MPTC Resignation...! MPTC Janaki , Bc Bandhu , Suryap

పార్టీ కోసం ఎనలేని సేవలందించినప్పటికీ త్రిపురావరం గ్రామనికి బీసీ బంధులో పేర్లు లేకపోవడంబాధాకరం అన్నారు.అనంతగిరి మండలానికి 39 మందికి బీసీ బంధు వచ్చిందని,అందులో నేను పెట్టిన ఐదు పేర్లలో ఒక్కటి కూడా రాకపోవడంతో ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు.

ఇదిలా ఉంటే మండలంలో కొన్ని గ్రామాల సర్పంచులు పంపించిన పేర్లు కూడా పరిశీలనలోకి తీసుకోకపోవడంతో వారు కూడా అసహనంగా ఉన్నట్లు తెలుస్తుంది.మొత్తానికి బీసీ బంధు పథకం అనంతగిరి మండల బీఆర్ఎస్ పార్టీలో దుమారం రేపుతుంది.

Advertisement

Latest Suryapet News