తెలంగాణలో లాక్‌డౌన్ పొడగింపుతో మారిన బ్యాంకుల పనివేళలు.. !

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బ్యాంకుల పని వేళల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.

కాగా ఇది వరకు లాక్ డౌన్ సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ఉండగా, బ్యాంకులు కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే పనిచేశాయి.

కానీ నిన్న రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ, లాక్‌డౌన్ సమయాన్ని కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పెంచారు.దీంతో వర్తక వ్యాపారాల్లో, ఇతర కార్యకలాపాల్లో కూడా పలు మార్పులు చోటు చేసుకోగా, రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు కూడా మార్చబడ్దాయి.

Banks Working Hour Changed With Lockdown Extension In Telangana Telangana, Bank

ఈ నేపధ్యంలో ఇక నుండి బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయని రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ పేర్కొంది ఇక ఈ నిర్ణయంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారట.లేదంటే సమయం సరిపోక పోవడంతో రోడ్ల పైన ఆ నాలుగు గంటలు రద్దీ ఎక్కువగా ఉండేది.

ప్రభుత్వ నిర్ణయంతో ఆ రద్దీ కాస్త తగ్గిందట.

Advertisement
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

తాజా వార్తలు