నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ గా బచ్చలకూరి ప్రకాష్...!

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల బీఆర్ఎస్ పార్టీ( BRS PARTY )కి చెందిన మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబుపై గత నెల 23న ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో మొత్తం 15 మంది కౌన్సిలర్లకు గాను, 13వ వార్డు కౌన్సిలర్ చల్ల శ్రీలత రెడ్డి రాజీనామా చేయడంతో,14 మంది కౌన్సిలర్లలో 13 మంది కౌన్సిలర్లతో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసంలో నెగ్గిన సంగతి తెలిసిందే.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో సోమవారం హుజూర్ నగర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి( RDO Jagadishwar Reddy ) అధ్యక్షతన మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికకు కోరం పూర్తి అయిన నేపథ్యంలో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ గా 11వ వార్డు కౌన్సిలర్ బచ్చలకూరి ప్రకాష్,వైస్ చైర్మన్ గా 6 వ,వార్డు కౌన్సిలర్ అలక సరితను మెజార్టీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.చైర్మన్,వైస్ చైర్మన్లతో ప్రమాణస్వీకారం చేయించి,వారికి నియామక పత్రాలు అందుజేశామన్నారు.

వైస్ చైర్మన్ ఎన్నికలో కొంత రసాభాస జరిగినా చివరికి అలక సరితానే వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి,స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించి, నూతన చైర్మన్,వైస్ చైర్మన్ లకు శుభాకాంక్షలు తెలిపారు.

నేరేడుచర్ల పరిసరాలను కమ్మేసిన దట్టమైన పొగ మంచు
Advertisement

Latest Suryapet News