మాతా శిశు దవాఖానలో శిశువు మృతి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు చెబుతున్నట్లుగా ప్రభుత్వ దవఖానాల పరిస్థితి లేదని,జిల్లా ఆసుపత్రుల్లో కూడా సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘటనలు కోకొల్లలు.

సిబ్బంది కొరతతో పాటు,వైద్య సిబ్బంది కూడా సరిగ్గా స్పందించే పరిస్థితి లేకపోవడం,విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వెరసి ప్రజల ప్రాణాలు గాల్లో కాలుస్తున్నాయనే అపవాదును ప్రభుత్వ ఆసుపత్రులు మూటగట్టుకుంటున్నాయి.

అత్యంత ఘోరమైన వైద్య సేవలతో నడుస్తున్న ప్రభుత్వ దవాఖానాలను రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పెట్టుబడి పెట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వ దావఖానకొస్తే పైసలు లేనిదే పని కావటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Baby Died In Mata Shishu Hospital-మాతా శిశు దవాఖాన�

ప్రభుత్వ ఆసుపత్రుల పని తీరుకు అద్దం పట్టే విధంగా ఉన్నదే శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మతాశిశు ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఘటన.ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మగ శిశువు మృతి చెందిదని ఆరోపిస్తూ బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం దవాఖానలో అందుతున్న వైద్య సేవల భాగోతం వెలుగులోకి వచ్చింది.కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

సూర్యాపేట జిల్లా మెళ్ళచెరువు మండల కేంద్రానికి చెందిన కేతేపల్లి ఇంద్ర (24) మొదటి కాన్పు కోసం సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ కు 12 వ తారీకున అడ్మిట్ అయింది.రెండు రోజులుగా నొప్పులు వస్తున్నా డాక్టర్లు ఆమెను పట్టించుకోకుండా ఏమి కాదని చెబుతూ నార్మల్ డెలివరీ చేస్తామని హాస్పిటల్ చెబుతూ వచ్చారు.

Advertisement

వైద్యులు సరైన సమయంలో స్పందించక పోవడంతో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మళ్ళీ పురిటి నొప్పులు వచ్చాయి.అప్పుడు స్పందించిన వైద్యులు ఆ గర్భిణికి చికిత్స అందించి ఆపరేషన్ చేయగా మగ శిశువు మృతి చెందాడు.

వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మగ శిశువు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వ హాస్పిటల్ లో అన్ని వసతులు ఉంటాయని వస్తే ఈవిదంగా జరిగిందని బోరున విలపించారు.

ప్రభుత్వ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి మొదటి కాన్పులో మగ శిశువుకు పుట్టాడనే ఆనందం కూడా లేకుండా తమ ఆశలు ఆవిరి చేశారని రోధించారు.హాస్పిటల్ సిబ్బంది రోగుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి ఘటనలకు భాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇంటి పన్ను కట్టని ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది ధర్నా
Advertisement

Latest Suryapet News