ఓటు హక్కు వినియోగంపై స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన

ఓటు హక్కు( Right to Vote )ను ప్రతీ ఓటరు తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని డీఆర్డీఓ శేషాద్రి పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు ఓటు హక్కు వినియోగంపై సోమవారం స్వీప్ ( Systematic Voters Education And Electoral Participation ) ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని సమాఖ్య భవనంలో, రుద్రవరం గ్రామంలోని వీఓ భవనంలో అవగాహన సదస్సులు నిర్వహించారు.

ఐ ఓటు ఫర్ ష్యూర్( I Vote For Sure ) ఓటు హక్కు నా బాధ్యత పై మండల సమాఖ్య బాధ్యులు, వీఓ ప్రెసిడెంట్లు, వీఓఏలకు అవగాహన కల్పించారు.ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును వేయాలని ఓటరు ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి, అడిషనల్ డీఆర్డీఓ గొట్టే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?
Advertisement

Latest Rajanna Sircilla News