కొనయపల్లిలో రైతులకు మట్టి నమూనాలపై అవగాహన కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని కొనయపల్లిలో మట్టి నమూనాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఇందులో భాగంగా మట్టి నమూనాను తీసే విధానం మరియు దాని యొక్క ఉపయోగాలు తెలుపారు.

మట్టి నమూనాల పరీక్ష ఫలితాల ద్వారా భూమి యొక్క సారం, పదార్థాలు అందులోని కర్బన పదార్థం, ఎన్ని ఎరువులు వాడాలి అనే అంశాలు మనకు తెలుస్తాయని వివరించారు.అలాగే వేములవాడ మండలంలోని గ్రామాల్లో మట్టి నమూనాలను AEO ల ద్వారా సేకరించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్, ఏఈఓ రాజు, రైతులు పాల్గొన్నారు.

సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
Advertisement

Latest Rajanna Sircilla News